Bigg Boss 5 Telugu: ఫస్ట్‌ టాస్క్‌లో ఫెయిల్‌… తర్వాత కూడా సైలెన్స్‌ అందుకేనా?

ఈ వారం బిగ్‌ బాస్‌ ఇంటి నుండి ఎవరు బయటికొస్తారు? అంటూ బయట పోల్స్‌, డిస్కషన్స్‌ నడుస్తూ ఉంటాయి. ఒక్కోసారి బిగ్‌బాస్‌ ఇంట్లో కూడా ఈ చర్చలు నడుస్తుంటాయి. ఏడో వారానికి సంబంధించి మంగళవారం చిన్నపాటి చర్చ నడిచింది. అందులో వినిపించిన మూడు పేర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే, బిగ్‌బాస్‌ జనాల మాటలు పట్టించుకుంటే… ఆ ముగ్గురిలో ఒకరు వెళ్లిపోవడం పక్కా. ఈ డిస్కషన పెట్టి… పేరు చెప్పిన వ్యక్తే వెళ్లిపోతాడని తెలుస్తోంది.

ఈ వారం ఎలిమినేట్‌ ఎవరు అవుతారు అనే విషయం మీద జెస్సీ-సిరిల మధ్య డిస్కషన్‌ నడిచింది. అయితే రవి ఈసారి కూడా ఎలిమినేట్‌ కాడని జెస్సీ అన్నాడు. దీంతో నేను లేదా శ్రీరామ్‌లో ఒకరు బయటకు వెళ్లే అవకాశం ఉందని జెస్సీ అంచనా వేశాడు. ఒకవేళ అమ్మాయిల్లో ఎలిమినేషన్‌ అయితే… ఆ అవకాశం కాజల్‌కే అని జెస్సీ జోస్యం చెప్పాడు. ఇదంతా చూస్తుంటే జెస్సీ చెప్పిన మాట కచ్చితంగా నెరవేరా కనిపిస్తోంది.

ఇక ఏం జరుగుతుందనేది చూస్తే… ఈ వారం తొలి రెండు రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు సరిగ్గా పర్‌ఫామ్‌ చేయని వాళ్లలో శ్రీరామ్‌, జెస్సీ ఉన్నారు. హంటర్‌ టాస్క్‌లో ఈ ఇద్దరూ ఒక్కసారి కూడా డేరా నుండి బయటకు రాలేదు. శ్రీరామ్‌ ప్రయత్నం చేసినట్లు కనిపించాడు కానీ, జెస్సీ నుండి అది కూడా పెద్దగా కనిపించలేదు. మరోవైపు కాజల్ యాక్టివ్‌గానే కనిపించింది. వరుసగా అమ్మాయిల్ని ఎలిమినేట్‌ చేయొద్దు అంటే ఈ సారి ఈ సూపర్‌ మోడల్‌ బయటకు వెళ్లడం పక్కా అని సమాచారం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus