ప్రతి ఐదేళ్లకు ఒకసారి సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారుతుంది. ఒకప్పుడు బాగా నచ్చిన సినిమాలే మారుతున్న కాలం వల్ల నచ్చకుండా ఉండటం పలు సందర్భాల్లో జరుగుతుంది. విక్రమ్, జైలర్ సినిమాల విజయాలతో కోలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ అవుతోంది. విక్రమ్ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకుడు కాగా జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. విక్రమ్, జైలర్ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పట్టారు.
నవతరం ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా కథలతో టాలీవుడ్ దర్శకులు సక్సెస్ అవుతారా? టాలీవుడ్ దర్శకులు ఈ తరహా కథలపై దృష్టి పెడతారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కథనంలోని ఆసక్తికర ట్విస్టులు ఈ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. విక్రమ్, జైలర్ సినిమాలు ప్రధానంగా యూత్ ను ఆకట్టుకున్నాయి. కమల్, రజనీ నట విశ్వరూపం ఈ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించడం గమనార్హం.
లోకేశ్ కనగరాజ్, నెల్సన్ తర్వాత సినిమాలతో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కథ, కథనంపై ప్రత్యేక దృష్టి పెట్టడమే రాజమౌళి సక్సెస్ సీక్రెట్ అనే సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు తీసే దర్శకులు ప్రధానంగా కథ, కథనంపై దృష్టి పెట్టాల్సి ఉంది.
విక్రమ్, జైలర్ సినిమాలకు సీక్వెల్స్ వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జైలర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే నెల్సన్ వెల్లడించగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ (Tollywood) దర్శకుల సక్సెస్ రేట్ పెరగాలని తెలుగు సినీ అభిమానులు కోరుకుంటున్నారు.