‘కాంతార’.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు..యావత్ సినీ ప్రపంచం తలతిప్పి కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన పేరు.. ఇది మా కన్నడ సినిమా అని కన్నడిగులంతా కాలర్ ఎగరేస్తున్న పేరు.. పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు పుట్టిస్తున్న పేరు.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రిషబ్ శెట్టి క్రియేషన్ ‘కాంతార’..‘కె.జి.యఫ్‘ తర్వాత కన్నడ పరిశ్రమ పేరు ప్రపంచమంతా బీభత్సంగా వినిపిస్తున్న ‘కాంతార’ గురించి..
యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి, సినిమాలో ఆయన చూపించిన కర్ణాటక సాంప్రదాయ కళ, కళాకారుల గురించిన వార్తలు గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే లేటెస్ట్ హైలెట్ షాకింగ్ అండ్ సర్ ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే.. ‘కాంతార’ కంటే ముందే ఈ జానర్ లో, కన్నడలో ఓ సినిమా వచ్చిందట.. ఈ సంగతి ఇప్పటివరకు చాలామందికి తెలియదు.. ఆ మూవీ పేరు ‘పింగారా’.. దీన్ని కన్నడతో పాటు తులు భాషలోనూ తెరకెక్కించారు.
అట్టడుగు, బలహీన వర్గాల వారి పోరాటాల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా సోల్ ఉన్న సినిమా అని, ‘కాంతార’ తో కంపేర్ చేస్తే.. హానెస్ట్ గా తీసిన సినిమా అని కూడా చెబుతుంటారు. ప్రీతమ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకుడు.. ‘కాంతార’ మాదిరిగానే ఇందులోనూ కన్నడ సంసృతీ, సాంప్రదాయాలకు పెద్దపీట వేశారు కానీ.. కమర్షియల్ హంగులు, సినిమాటిక్ లిబర్టీస్ అనే వాటి జోలికి పోకపోవడంతో ‘పింగారా’ కేవలం ఫిలిం ఫెస్టివల్స్ కి మాత్రమే పరిమితమైంది..
ఏది ఏమైనా ఈ జెనరేషన్ లో తమ ప్రాంతం, ప్రజలు, వారి జీవన విధానం, అంతరించిపోతున్న కళ, కళ కోసమే జీవించే కళాకారులు, వారి సంసృతీ, సాంప్రదాయాలను కథా వస్తువుగా తీసుకుని.. కేవలం కమర్షియల్ గానే కాకుండా.. అందరి మనసుల్ని హత్తుకునేలా.. పాత్రలో నటించడం కంటే జీవించి.. అత్యద్భుతంగా తన దర్శకత్వ ప్రతిభను చూపించిన రిషబ్ శెట్టి కూడా ప్రశంసనీయుడే అంటున్నారు కన్నడ సినీ వర్గాల వారు..
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!