ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలను పురస్కరించుకొని అల్లురామలింగయ్య పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాదులో పార్క్ హయత్ హోటల్లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు కూడా హాజరయ్యారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాను నాలుగవ తరగతిలో చదువుతున్నప్పుడు తన తాతయ్య తనకు తెలియకుండానే తన పేరుపై డబ్బును జమ చేశారు. అయితే ఆయన మరణించిన తర్వాత తన 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. అయితే ఆ డబ్బులు ఏంటి అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. మా తాతయ్య బీమా కట్టే సమయంలో నేను నాలుగో తరగతిలో ఉన్నాను. అయితే అప్పుడే ఆయన నేను ఎందుకు పనికిరానని భావించి డబ్బులు జమ చేయడం మొదలుపెట్టారు.
వీడికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ 10 లక్షల రూపాయలతో ఏదో ఒక పని చేసుకుంటారని ఆయన డబ్బు జమ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఆయన దృష్టిలో ఎందుకు పనికిరాని నేను నేడు ఈ స్థాయిలో ఉన్నాను. అయితే నేడు నా ఎదుగుదలను చూడటానికి తాతయ్య లేరు. ఆయన ఉండి ఉన్నింటే ఎంతో ఆనందపడే వారని
ఈ సందర్భంగా తన తాతయ్య గురించి అల్లు అర్జున్ ఎమోషనల్ అవుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక అల్లు అర్జున్ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.