రణబీర్ కపూర్,’అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి.
వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా నిన్న సోమవారం రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
10.30 cr
సీడెడ్
1.64 cr
ఉత్తరాంధ్ర
2.29 cr
ఈస్ట్
1.09 cr
వెస్ట్
0.93 cr
గుంటూరు
1.01 cr
కృష్ణా
1.18 cr
నెల్లూరు
0.65 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
19.09 cr
‘యానిమల్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 4 రోజులు పూర్తయ్యేసరికి రూ.19.09 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్ కి ఇప్పటివరకు రూ.7.89 కోట్ల లాభాలను అందించింది.