సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరొకరు మరణవార్త వినిపిస్తూనే ఉంది. దీంతో సినీ పరిశ్రమకు చెందిన వారందరిలో ఆందోళన నెలకొంటుంది. తమిళ బుల్లితెర నటి శృతి షణ్ముగప్రియ భర్త అరవింద్ మరణ వార్త బయటకు వచ్చి 24 గంటలు కాకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.తాజాగా స్టార్ కమెడియన్ కైలాస్ నాథ్ కన్నుమూశారు. 1999 టైంలో తన కామెడీ టైమింగ్ తో సినీ పరిశ్రమని ఓ ఊపు ఊపేసారు కైలాష్ నాథ్. ఈయన చేసినవి తక్కువ సినిమాలే అయినా.. మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కరోనా తర్వాత ఈయన ఆరోగ్యం క్షీణించింది.
ఈ క్రమంలో హాస్పిటల్ లో చేరిన ఆయన నిన్న అంటే గురువారం నాడు మరణించినట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఆయన లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతూ వచ్చారట.లివర్ వద్ద కొవ్వు చేరడంతో.. ఆయనకు సమస్యలు తలెత్తాయి. రెండు మూడు రోజులుగా ఆయన మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఆయన మరణవార్తను ‘సీమా నాయర్’ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.
‘సంఘమ్’ తో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కైలాష్. ఆ తర్వాత చేసిన ‘ఒరు తలై రాగమ్’ ‘యుగపురుషన్’, ‘ఏదో ఒరు స్వప్నమ్’ వంటి సినిమాలు ఈయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన మరణవార్తతో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.