టాలీవుడ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నేడు విడుదలైంది. అయితే ఈ సినిమాకు ముందు నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మించి ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని చెప్పాలి. అన్ని ప్రాంతాలలోనూ ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి 32 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడు ఒకచోటకు వచ్చి తపస్సు చేస్తుంటారనే ప్రచారంతో స్ఫూర్తి పొంది తాను హనుమాన్ సినిమా కథను రాసుకున్నానని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇక ఈ కథతో మేము సినిమా చేసాము అనే విషయం మాకు తెలుసు కానీ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో ఆదరణ వస్తుందని అసలు ఊహించలేదని ఇదంతా ఒక కలలా ఉంది అంటూ ఈ సందర్భంగా ఈయన ఈ సినిమాకు వస్తున్నటువంటి స్పందన గురించి తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాకు ఉత్తరాది రాష్ట్రాలలో ఎంతో మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఇక నాపై మన పురాణాలు ఎంతో ప్రభావం చూపాయని ఈయన వెల్లడించారు. మన పురాణాలను ఆధారంగా చేసుకొని ఎంతోమంది దర్శకులు సినిమాలను చేసారు అందులో నేను కూడా ఒకరు అంటూ ప్రశాంత్ తెలిపారు.
ఇక నేను మహాభారతం సినిమాని కూడా చేయాలని అనుకున్నాను కానీ మహాభారతం సినిమాని రాజమౌళి సార్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసి నా ఆలోచనను విరమించుకున్నానని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) హనుమాన్ సినిమా గురించి అలాగే మహాభారతం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.