Double iSmart: యూట్యూబ్‌లో అదరగొడుతున్న రామ్ – పూరి డిజాస్టర్ సినిమా.. కారణమేంటో?
- January 29, 2025 / 05:04 PM ISTByFilmy Focus Desk
మన దగ్గర విజయం సాధించే సినిమాల కంటే తేడా కొట్టిన సినిమాలకే అక్కడ విలువ ఎక్కువనా? ఏమో రీసెంట్‌గా విజయం సాధించిన సినిమాలను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. మీరే చూసుకోండి ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమా గురించే చూడండి మీకే తెలుస్తుంది. నెల రోజుల క్రితం యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ అతి తక్కువ సమయంలో వంద మిలియన్ వ్యూస్ దాటింది. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా మన దగ్గర దారుణమైన ఫలితాలు అందుకుంది.
Double iSmart

ఇటు థియేటర్‌లోను, అటు ఓటీటీలోనూ సినిమా తిరస్కరణకు గురైంది. కానీ సినిమా హిందీ వెర్షన్ ఇలా యూట్యూబ్‌లోకి వచ్చిందో లేదో అలా 50 రోజులకు బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానికి ఉదాహరణే ఈ వంద మిలియన్ల వ్యూస్. ఈ జోరు ఇంకా కొనసాగేలానే ఉంది. ఇదంతా చూస్తుంటే మేం పైన చెప్పిందే నిజం అనిపిస్తోంది కదా. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇది ఈ ఒక్క సినిమాకే ఇలాంటి పరిస్థితి లేదు. గతంలో వచ్చిన సినిమాలకూ ఇదే పరిస్థితి.

‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమాకు ఇప్పటివరకు 390 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘హలో గురూ ప్రేమ కోసమే’ (Hello Guru Prema Kosame), ‘వారియర్’ (The Warriorr), ‘స్కంద’ (Skanda) లాంటి సినిమాలకు భారీగానే వ్యూస్ వచ్చాయి. ఇదేదో కేవలం రామ్ (Ram) సినిమాలకే పరిమితం కాలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నితిన్ (Nithin Kumar) సినిమాలకు మంచి ఆదరణే దక్కుతోంది. అంటే మన దగ్గర తెరకెక్కే రొడ్డ కొట్టుడు మాస్ సినిమాలకు మన దగ్గర విజయం అందకపోయినా ఆ సినిమాలకు బాలీవుడ్ జనాల ఆదరణ బాగుంటోంది.

అయితే ఇలాంటి సినిమాలు థియేటర్లలో వస్తే చూడటం లేదు. కేవలం యూట్యూబ్‌లో మాత్రమే చూస్తున్నారు. మరి దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటా అని చూస్తే.. మల్టీప్లెక్స్ స్క్రీన్లకు దూరంగా ఉండే వాళ్లు యూట్యూబ్‌ల్లో ఈ సినిమా చూసి ఆనందిస్తున్నారు. నార్త్‌లో ఎక్కువగా ఉండేది ఇలాంటి ఎక్కువ టికెట్ రేటు ఉంటే మల్టీప్లెక్స్‌లే కదా. అన్నింటికి మించి యూట్యూబ్ ఫ్రీ.












