కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతుంది ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే కావ్య చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ నేను మాట్లాడకపోతే ఇంటిలో కావ్య పై మహారాణి లాగా ఉంటుంది ఆ అవకాశం తనకు ఇవ్వనని భావించిన ఈమె తన పంతం పక్కనపెట్టి కావ్య పై రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తుంది.
మరుసటి రోజు ఉదయం అపర్ణ వచ్చి సోఫాలో కూర్చుని ఇంత సమయం అయింది ఇంకా ఎవరికి కాఫీ అందివ్వలేదు కావ్య ఏం చేస్తున్నావ్ అందరికీ కాఫీ ఇవ్వు అని అనడంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే కావ్య ఇప్పుడే అందరికీ ఇస్తాను అత్తయ్య అంటూ కాఫీ ఇస్తుంది అందరూ కూడా కావ్య పై కోపంతో వేరే కుంపటి పెట్టిన అపర్ణ ఇలా మారిపోయింది ఏంటి ఆశ్చర్యపోతారు.
రుద్రాణి అపర్ణ వద్దకు వచ్చి నీ కోడలు నీకు చేసిన అవమానం మర్చిపోయావా వదిన అప్పుడే తనతో మాట్లాడుతున్నావు అంటూ అడగడంతో అందరూ రుద్రాణిపై ఫైర్ అవుతారు. ఇక టిఫిన్ ఏం చేస్తున్నావు కావ్య అనడంతో రవ్వ ఇడ్లీ చేస్తున్నాను అత్తయ్య అని కావ్య చెబుతుంది ఎవరిని అడిగి నువ్వు ఈ టిఫిన్ చేస్తున్నావు. చేసే ముందు నన్ను అడగాలి కదా అంటూ అత్త పెత్తనం చెలాయిస్తుంది వెంటనే దోసెకు ఏర్పాట్లు చెయ్యి అని చెప్పడంతో సరే అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇలా అపర్ణ కావ్యతో మాట్లాడటంతో కుటుంబ సభ్యులందరూ సంతోషపడతారు. ఇక వాకింగ్ వెళ్లి వచ్చినటువంటి రాజ్ ను తన తల్లి పలకరించడంతో ఒక్కసారిగా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ అందరితో తన సంతోషాన్ని పంచుకుంటారు. మీ అమ్మ నీతో మాట్లాడింది అంటే కారణం కావ్య అని దాన్యలక్ష్మి చెప్పడంతో రాజ్ తనగదికి వెళ్లి కావ్యాన్ని ఎత్తుకొని సంతోషంలో తిప్పడమే కాకుండా తనకు థాంక్స్ చెబుతారు మరోవైపు కావ్య కోసం కృష్ణమూర్తి ఎదురు చూస్తూ ఉంటారు.
అయినప్పటికీ కావ్య రాకపోవడంతో నేను షాప్ దగ్గర ఉంటాను కావ్య వస్తే అక్కడికి రమ్మని చెప్పు అంటూ తన భార్యకు చెప్పి కృష్ణమూర్తి అక్కడికి వెళ్తారు. ఇక మరోవైపు రుద్రాణి అసలు కావ్య తో ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పడంతో ఆపర్ణ తనపై ప్రేమతో నేను మాట్లాడటం లేదు కేవలం తనపై పగ తీర్చుకోవడం కోసమే మాట్లాడుతున్నాను ఇకపై నేను చెప్పిన ప్రతి పని కావ్య చేయాల్సిందే ఇంట్లో పని మనిషిని కూడా తీసేసాను అంటూ తన మనసులో ఉన్నటువంటి కోపాన్ని బయటపెడుతుంది.
ఇక తరువాయి భాగంలో కావ్య వచ్చి సీతారామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఏంటి అని అడగడంతో నేటితో కాంట్రాక్ట్ పూర్తి అవుతుంది. ఇల్లు నాన్న సొంతం అవుతుంది అని సంతోషపడుతుంది అయితే రుద్రాన్ని మాత్రం తన కొడుకు రాహుల్ కి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి బొమ్మలను దొంగలించమని చెప్పడంతో రాహుల్ రౌడీలను ఏర్పాటు చేసి కృష్ణమూర్తి పై దాడి చేసి ఆ బొమ్మలను దొంగలిస్తారు.