టాప్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో ‘కలియుగం 2064’ (Kaliyugam 2064) అనే సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ రూపొందింది. ‘ఆర్.కె.ఇంటర్నేషనల్’ సంస్థపై కె.ఎస్. రామకృష్ణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ప్రమోద్ సుందర్ దర్శకుడు. ఈ సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘కలియుగం 2064’ ట్రైలర్ ను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంచ్ చేశారు.
సోషల్ మీడియాలో హీరో సుశాంత్ కొద్దిసేపటి క్రితం లాంచ్ చేయడం జరిగింది. ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 23 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘భయంతో ఆకలితో చద్దామా.. లేక పోరాడి చద్దామా అది మన చేతిలోనే ఉంది’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. 2064 లో కలియుగం వచ్చినట్టు.. ఆ టైంలో ఆహారం, నీరు వంటివి లేకపోవడం వల్ల మనుషులు మానవత్వం, విచక్షణ జ్ఞానం కోల్పోయి.. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం..
వంటి విజువల్స్ ట్రైలర్లో చూపించారు. శ్రద్దా శ్రీనాథ్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇందులో కూడా కల్కి అనే పాత్ర ఉంది. దాని కోసం శ్రద్దా శ్రీనాథ్ పాత్ర విలన్ తో పోరాడబోతుంది అనే హింట్ ఇచ్చారు.ట్రైలర్లో చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ వంటివి హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ కె.రామ్ చరణ్ పనితనం సూపర్ గా ఉంది. స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ శిష్యుడు అనిపించుకున్నాడు. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. ఇవన్నీ మే 9న రిలీజ్ అయ్యే ఈ ‘కలియుగం 2064’ పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :