ఈరోజు అంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ‘గంగోత్రి’ తో హీరోగా మారిన అల్లు అర్జున్.. ఇప్పుడు ‘పుష్ప'(ది రైజ్) తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ‘పుష్ప 2’ తో గ్లోబల్ స్టార్ గా ఎదుగుతాడు అని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ అప్డేట్ ఉందని చెప్పాలి. ఈరోజుతో అల్లు అర్జున్ 42 ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ 21 ఏళ్ళలో అల్లు అర్జున్ సాధించిన విజయాలు.. మూటగట్టుకున్న అపజయాల గురించి అందరికీ తెలుసు. కానీ అల్లు అర్జున్ ఫేస్ చేసిన వివాదాలు.. విమర్శల గురించి ఎక్కువ మందికి తెలిసుండదు. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం :
1) మొదటి సినిమా ‘గంగోత్రి’ లో అల్లు అర్జున్ (Allu Arjun) లుక్స్ పై చాలా ఘోరమైన విమర్శలు ఎదురయ్యాయి. ‘ఇతను హీరో ఏంట్రా బాబు’ అని కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ కి ఓ దశాబ్దం పాటు ట్రోల్ చేశారు కొంతమంది ప్రేక్షకులు.
2) సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ షార్ట్ ఫిలిం చేశాడు. ‘ఐ యామ్ దట్ చేంజ్’ అనేది ఆ షార్ట్ ఫిలిం. అందులో అల్లు అర్జున్ తనకు చాలా నిజాయితీ ఉన్నట్టు .. మార్పు తనతోనే మొదలవ్వాలి అన్నట్టు చాలా అద్భుతంగా నటించాడు. కానీ ఆ వెంటనే అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. ఇది అప్పట్లో సంచలనం అయ్యింది.
3) గోవాలోని ఓ వైన్ షాప్ లో అల్లు అర్జున్ మద్యం కొనుగోలు చేయడానికి వెళ్లడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై కూడా సెటైర్లు విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ‘ఇందులో తప్పేముంది..దానినే డౌన్ టు ఎర్త్ అంటారు’ అంటూ ఫ్యాన్స్ వెనకేసుకొచ్చారు. తర్వాత అది ఓ సినిమాలో క్లిపింగ్ అన్నారు.
https://youtu.be/6qPvL2CbWpA
4) ‘రుద్రమదేవి’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి గొప్పతనం గురించి చెప్పిన బన్నీ… కొంతకాలం నుండి వాళ్ళ తాతగారు అల్లు రామలింగయ్య గారు లేకపోతే ఎవ్వరూ లేరు అన్నట్టు కామెంట్స్ చేసి విమర్శల పాలయ్యాడు.
5) గతంలో తన ఫేవరెట్ డాన్సర్ ఎవరు అంటే ‘నిస్సందేహంగా చిరంజీవి’ అని చెప్పిన బన్నీ.. అటు తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు గోవింద తన ఫేవరెట్ డాన్సర్ అని చెప్పి.. మెగా అభిమానులను గిల్లాడు. నిజానికి గోవింద నే తన అభిమాన డాన్సర్ చిరంజీవి అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
6) ‘సరైనోడు’ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు.. అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని గట్టిగా అరిచారు. అందుకు బన్నీ ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం ఇష్టం లేదు అన్నట్టు వ్యవహరించాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులను హర్ట్ చేసింది. దీంతో ‘చూసుకుంటాం బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు పవన్ అభిమానులు.
7) ‘ఒక మనసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పెద్ద ఎత్తున క్లాస్ పీకాడు బన్నీ. పక్క వాళ్ళ సినిమా ఫంక్షన్లలో ‘పవర్ స్టార్ పవర్ స్టార్’ అంటూ అరుస్తారేంటి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు బన్నీ. కానీ తర్వాత ‘కుమారి 21ఎఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన బన్నీ.. ‘ఎవ్వరినీ మాట్లాడకుండా తన అభిమానులు అరవడం.. టీ షర్ట్లు వేసుకురావడం చాలా బాగుంది’ అంటూ కామెంట్లు చేశాడు. ఈ రెండు సందర్భాలను గుర్తు చేస్తూ పవన్ అభిమానులు.. అల్లు అర్జున్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు.
8) ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘కృష్ణ గారికి దాదా సాహెబ్ పాల్ కె పురస్కారం దక్కేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుకుంటున్నట్టు’ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురం’ ఈవెంట్ లో అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ కు పద్మశ్రీ పురస్కారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ కామెంట్లు చిరంజీవి కామెంట్లకు సెటైర్ వేసినట్టు ఉన్నాయని బన్నీ పై విమర్శలు వెల్లువెత్తాయి.
9) మార్చ్ 28న తన కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్ళు పూర్తయినప్పుడు చిరంజీవి కి థాంక్స్ చెబుతూ బన్నీ ఎటువంటి ట్వీట్ వేయలేదు. కానీ చిరు స్వయంగా బన్నీ ఇంకా ఎంతో సాధించాలి అని అభినందించారు. దీనిపై కూడా బన్నీ నెగిటివ్ కామెంట్లు ఫేస్ చేశాడు.
10) ‘ఆర్.ఆర్.ఆర్’ లో ‘నాటు నాటు’ కి ఆస్కార్ వచ్చినప్పుడు.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా అభినందించిన బన్నీ.. చరణ్ ను మాత్రం గుంపులో గోవిందా అన్నట్టు కలిపేశాడు. ఇక చరణ్ పుట్టినరోజు నాడు కూడా బన్నీ ఎటువంటి ట్వీట్ వేయలేదు. దీనిపై కూడా బన్నీ విమర్శలు ఎదుర్కొన్నాడు.
మొత్తంగా అల్లు అర్జున్ కాబట్టి.. ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా.. వాటిని అధిగమించి ఈరోజు పాన్ ఇండియా స్టార్ కి ఎదిగాడు కానీ.. బాధపడుతూ అక్కడే ఆగిపోలేదు.దేనికి లొంగలేదు.. దేని పై ఆధారపడలేదు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు అని చెప్పాలి.