హీరో చుట్టూ తిరిగే కథలతోనే సినిమాలు రూపొందుతుంటాయి. వ్యాపారం బాగా జరగాలని నిర్మాతలు ఇటువంటి చిత్రాలను నిర్మించడానికి ముందుకువస్తుంటారు. అందుకే హీరోయిన్ కి ప్రాధాన్యమున్న సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఈ విషయంపై ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ని అడగగా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. “తెలుగు సినిమాలన్నీ హీరో చుట్టూ నడుస్తాయనీ, కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఇక్కడ రావనీ చాలామంది అంటుంటారు. ఒక్క తెలుగు పరిశ్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పురుషాధిక్యతే’’ కనిపిస్తుంది’’ అని రకుల్ కుండలు బద్దలు కొట్టేలా సమాధానం ఇచ్చింది.
గతవారం హైదరాబాద్ లో జరిగిన ఐఫా ఉత్సవంలో సందడిచేసిన ఈ భామ తన మనసులోని మాటని ఉన్నది ఉన్నట్టు బయటపెట్టింది. ‘‘సినిమారంగం అనే కాదు ప్రపంచంలో ఏ రంగాన్ని తీసుకున్నా నూటికి నూరు శాతం పురుషాధిక్యతే కనిపిస్తుంది. సినిమా అనేది వినోదం పంచే మాధ్యమం కాబట్టి జనాల ఫోకస్ అంతా సినిమాల మీద ఉంటుంది” అని వివరించారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలొస్తే సత్తా చాటడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.