Mukesh, Deepika: దీపికా వస్త్రధారణలో అశ్లీలత ఎక్కువగా ఉంది… ఇకపై నగ్నంగా కూడా నటిస్తారేమో: ముఖేష్ ఖన్నా

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ చాలా రోజుల తర్వాత పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా పటాన్ సినిమా జనవరి 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా విడుదలైనటువంటి పాట పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంది ఇందులో దీపిక పదుకొనే ఎక్కువగా బికినీలు ధరించడంతో చాలామంది ఈమె వ్యవహార శైలి పై, ఈమె వస్త్రధారణ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపోతే తాజాగా శక్తిమాన్ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలీవుడ్ నటుడు ముఖేష్ కన్నా కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపిక వస్త్రధారణలో ఎక్కువగా అశ్లీలత ఉందని,

బహుశా ఇకపై ఆమె నగ్నంగా కూడా నటిస్తారేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం భారతదేశంలో ఉన్నాము మనదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఎంతోమంది పొగుడుతూ ఉంటారు. అలాంటి మంచి పేరును చెడగొట్ట వద్దని ఈయన తెలియజేశారు. ఇకపోతే పలు సినిమాలలో ఇలాంటి సన్నివేశాలలో నటిస్తున్న సెన్సార్ సభ్యులు ఏం చేస్తున్నారు.

అసలు సెన్సార్ పని చేస్తుందా? అంటూ ఈయన పరోక్షంగా సెన్సార్ వారిపై కూడా మండిపడ్డారు. ప్రస్తుతం ముఖేష్ కన్నా చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే బాలీవుడ్ సినిమాలలో ఈ విధమైనటువంటి సన్నివేశాలలో హీరోయిన్లు నటించడం ఇలాంటి వివాదాలు రావడం సర్వసాధారణం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus