నాగచైతన్య (Naga Chaitanya) , శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ హై ప్రొఫైల్ ఈవెంట్‌కి అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు, మెగా, నందమూరి కుటుంబాల ప్రముఖులు, వ్యాపార, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇక అనుగుణంగా ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పుడేమో, ఈ వివాహ వేడుక OTT వేదికపై ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ వివాహానికి స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం.
లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ డీల్ రూ.40 కోట్ల వరకు జరగవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఇది నయనతార (Nayanthara) -విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) వివాహం తరహాలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శనకు వచ్చే రెండవ సెలబ్రిటీ వివాహం అవుతుంది. వివాహానికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లలో చైతన్య శోభిత దంపతులు తమ సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటున్నారు. శోభిత, చైతూ మధ్య ఉన్న సన్నిహిత బంధాన్ని గత కొన్ని రోజులుగా నాగచైతన్య అనేక సందర్భాల్లో హైలైట్ చేస్తున్నారు.
‘‘శోభిత నాకు బాగా అర్థమవుతుంది, నా జీవితంలో ఆమె సంతోషాన్ని నింపుతుంది’’ అంటూ చైతూ ఎమోషనల్ కామెంట్స్ చేసారు. ఇరు కుటుంబాలు ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించాలనుకుంటున్నప్పటికీ, సినీ పరిశ్రమలో ప్రముఖులకు, స్నేహితులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహం ఒక డ్రీమ్ ఈవెంట్‌గా మార్చేందుకు అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ-వెడ్డింగ్ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, నెట్‌ఫ్లిక్స్ డీల్ వార్త ఈ వేడుకపై మరింత హైప్ తెచ్చింది.
వివాహ వేడుక స్ట్రీమింగ్ అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తర్వాత, చైతూ-శోభిత వివాహం కూడా ప్రేక్షకులకు ఓ ప్రత్యేక షో గా రాబోతోంది. ఏదేమైనా, ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడితే అది ప్రేక్షకుల కోసం ప్రత్యేక సర్‌ప్రైజ్ అవుతుందని చెప్పొచ్చు.