ఏ రంగంలోనైనా విజయం వరించాలంటే ప్రతిభ, శ్రమ, అంకితభావంతో పాటు ఉండాల్సిన మరో లక్షణం ఓపిక. ప్రస్తుతం ఆ మంత్రాన్ని పఠిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ మహారాజ్ రవితేజ. వీరిద్దరీ పేర్లు వేరైనా.. వంటి పేరు మాత్రం ఒకటే. అదే వేగం. చకచకా సినిమాలు చేయడం వీరికి అలవాటు. అవి హిట్ అయినా, ఫట్ అయినా దూసుకు పోతూనే ఉంటారు. జస్ట్ ఫర్ చేంజ్.. ఈ ఏడాది నుంచి ‘స్లో అండ్ స్టడీ’ సూత్రాన్నిపాటిస్తున్నారు. లేటుగా నైనా.. లేటెస్ట్ గా రావాలని భావిస్తున్నారు.
అందుకే కొత్త లైన్ కోసం ఎదురుచూస్తున్నారు. రవి తేజ నటించిన బెంగాల్ టైగర్ రిలీజ్ అయి దాదాపు ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు ఆయన కొత్త సినిమా సెట్స్ మీదకు పోలేదు. తారక్ కూడా మంచి కథ కోసం ఓపిగ్గా కథలను వింటున్నారు. తన గత చిత్రం జనతా గ్యారేజ్ రిలీజ్ అయినప్పటి నుంచి కథల ఎంపిక కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు. అయినా ఎన్టీఆర్ మనసుదోచుకునే స్టోరీ రాలేదు. తోటి హీరోలు రెండు, మూడు సినిమాలను ఒకే చేస్తున్న ప్రస్తుత తరుణంలో రవితేజ, తారక్ ఆలోచిస్తున్నారంటే.. ఏదో కొత్త కథలతోనే మనముందుకు రానున్నట్లు అర్ధమవుతోంది. కొత్తదనాన్ని ఆహ్వానించడంలో తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఇక ఆ చిత్రాలు హిట్ కావడం గ్యారంటీ.