Om Raut: వాళ్లు అబద్ధం చెబుతున్నారు.. ఓం రౌత్ సంచలన వ్యాఖ్యలు!

ఈ మధ్య కాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి విడుదలకు ముందు, విడుదల తర్వాత తీవ్రస్థాయిలో ట్రోల్స్ కు గురైన సినిమా ఏదనే ప్రశ్నకు ఆదిపురుష్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత తనపై వస్తున్న విమర్శల గురించి ఓం రౌత్ తనదైన శైలిలో స్పందిస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ కు ఎలాంటి స్పందన వస్తుందనేది ముఖ్యమని ఓం రౌత్ అన్నారు.

ఆదిపురుష్ మూవీకి వస్తున్న స్పందన విషయంలో నేను సంతోషంగా ఉన్నానని ఓం రౌత్ అన్నారు. ఈ స్పందన విషయంలో నేను చాలా హ్యాపీ అని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయని ఓం రౌత్ తెలిపారు. నాకు రామాయణం అంతా తెలుసని చెబితే మాత్రం అది అబద్దమే అవుతుందని ఓం రౌత్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదని నేను అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

మనకు తెలిసిన రామాయణం కేవలం ఉడుత చేసిన సాయమంత మాత్రమేనని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. నాకు రామాయణానికి సంబంధించి అర్థమైన కొంత భాగంను మాత్రమే వెండితెరపై చూపించే ప్రయత్నం చేశానని ఓం రౌత్ వెల్లడించారు. స్క్రీన్ పై పూర్తి రామాయణంను చూపించడం సులువైన విషయం కాదని ఓం రౌత్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ రీజన్ వల్లే యుద్ధకాండలోని కొంత భాగంపై నేను దృష్టి పెట్టానని ఓం రౌత్ పేర్కొన్నారు. రామాయణంను సంపూర్ణంగా గ్రహించడం సులువు కాదని ఆయన తెలిపారు. ఎవరైనా రామాయణం గురించి మొత్తం తెలుసని చెప్పారంటే వాళ్లు తెలివితక్కువ వాళ్లు అయినా అయ్యుండాలని లేదా అబద్ధం చెబుతుండాలని ఓం రౌత్ అన్నారు. ఓం రౌత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus