టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. కథ అద్భుతంగా ఉంటే ప్రయోగాత్మక సినిమాలలో నటించడానికి వరుణ్ తేజ్ ఆసక్తి చూపుతారు. గని, గాండీవధారి అర్జున సినిమాలతో ఆశించిన ఫలితాలను అందుకోని వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ నటిస్తున్నారు. “మన ఎయిర్ ఫోర్స్ ను ఇంకొక దేశంలోకి పంపించడం అంటే ఇట్స్ ఏ డిక్లరేషన్ ఆఫ్ వార్”, “ఇలా ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దేశాలు ఉండవు.. బోర్డర్స్ మాత్రమే ఉంటాయి” అనే డైలాగ్స్ బ్యాగ్రౌండ్ వాయిస్ తో ఈ టీజర్ మొదలవుతుంది. మన దేశం గాంధీదే కాదు బోస్ ది కూడా అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది.
టెక్నికల్ వాల్యూస్ హై రేంజ్ లో ఉండగా పాక్ లో ఉన్న టెర్రరిస్టులను అంతమొందించటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసే మిషన్ ఆపరేషన్ వాలంటైన్ అని అర్థమవుతోంది. ఈ సినిమా ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. టీజర్ లో వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నటించి విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాతో వరుణ్ కు కచ్చితంగా సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వరుణ్ తేజ్ పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ ను పరీక్షించుకోనున్నారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాతో (Operation Valentine) వరుణ్ ఖాతాలో హిట్ చేరినట్టేనని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.