తెలుగులో హార్ట్ మూవీస్ అంటే.. మనసుకి సంతృప్తినిచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటి ఓ అరుదైన చిత్రమే “ముత్తయ్య” (Muthayya). 70 ఏళ్ల వయసులో సినిమాలో నటించాలనే ఓ ముసలోడి ఆశ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. “బలగం” ఫేమ్ సుధాకర్ రెడ్డి టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి భాస్కర్ మౌర్య దర్శకుడు. ఈటీవీ విన్ యాప్ లో నేటి నుండి (మే 01) స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎందుకని మిస్ అవ్వకూడదు […]