మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ రిలీజ్ కు రెడీ అయ్యింది.చోళుల స్వర్ణయుగాన్ని ప్రేక్షకులకు గ్రాండ్ గా చూపించాలి అనే దర్శకుడి తాపత్రయం మొత్తానికి నెరవేరబోతోంది.4 దశాబ్దాల మణిరత్నం కలని.. ఆయన దృశ్యకావ్యంగా ఎలా మలిచారు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత ధూళిపాళ వంటి క్రేజీ నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని ‘లైకా ప్రొడక్షన్స్’, ‘మద్రాస్ టాకీస్’ సంస్థలు సంయుక్తంగా ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రెండు పార్టులను నిర్మించాయి.
సెప్టెంబర్ 30న ‘పొన్నియన్ సెల్వన్-1’ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ‘పొన్నియన్ సెల్వన్-1’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, విశ్లేషకుడు అయిన ఉమైర్ సందు ఈ చిత్రాన్ని వీక్షించి తన రివ్యూని షేర్ చేశాడు. అతని రివ్యూని గమనిస్తే..
‘పొన్నియన్ సెల్వన్-1’ చూడటం అనేది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా భావిస్తున్నాను.
ప్రొడక్షన్ డిజైన్ కానీ, వి.ఎఫ్.ఎక్స్ కానీ అదిరిపోయాయి.అవి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి.
చియాన్ విక్రమ్ మరియు కార్తీ లు తమ నటనతో ఆధ్యంతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కార్తీ పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు.
చాలా కాలం తర్వాత ఐశ్వర్య రాయ్ ని చూడటం ఆనందంగా అనిపించింది. ఆమె లుక్స్ కూడా కట్టిపడేస్తాయి.
మొత్తంగా ఈ చిత్రంలో చప్పట్లు కొత్త దగ్గ సన్నివేశాలు ఉన్నాయి అలాగే ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. ఇది ఒక డీసెంట్ చారిత్రాత్మక చిత్రమని చెప్పొచ్చు.. అంటూ 3/5 రేటింగ్ ఇచ్చాడు.
అంతేకాదు.. ఈ వీకెండ్ కు ‘పొన్నియన్ సెల్వన్-1’ మరియు ధనుష్ ‘నానే వరువేన్’ చిత్రాలు పైసా వసూల్ మూవీస్ అని కూడా ఉమైర్ చెప్పుకొచ్చాడు.కోలీవుడ్ బాక్సాఫీస్ ఈ వీకెండ్ షేక్ అవుతుంది అలాగే అక్కడి జనాలకు బిగ్ ట్రీట్ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఒక విషయాన్ని గమనించాలి. ఇతని రివ్యూలు నిజమైన సందర్భాలు చాలా తక్కువ.దాదాపు అన్ని సినిమాలకు ఇతను పాజిటివ్ రివ్యూలే ఇస్తాడు.
First Review #PS1 ! Amazing Cinematic Saga with Terrific Production Designing & VFX ! #ChiyaanVikram & #Karthi Stole the Show all the way. #AishwaryaRaiBachchan is Back & looking Stunning ! Overall, A Decent Historical Saga with some twists & Clap worthy moments.