Naga Vamsi: పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన నాగవంశీ.. ఏమైందంటే?
- March 21, 2025 / 09:00 AM ISTByPhani Kumar
‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ (Suryadevara Naga Vamsi ) ఏం మాట్లాడినా సెన్సేషనే. కొన్నిసార్లు ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే.. చాలా సెన్సిబుల్ గా, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఇంకా కొన్ని సార్లు అతను ‘ఓవర్ ది టాప్’ అన్నట్టు మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంటుంది. ఏదేమైనా టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అతను ఒకడు. ఏడాదికి కనీసం 5,6 సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంటాడు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందే సినిమాల ప్రమోషన్స్ లో కూడా నాగవంశీనే పాల్గొంటాడు.
Naga Vamsi

ఇదిలా ఉండగా.. ఇతని సమర్పణలో రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) మార్చి 28న విడుదల కాబోతుంది. దీని ప్రమోషన్స్ లో భాగంగా టీంతో ఏర్పాటు చేసిన కామన్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఎన్టీఆర్ (Jr NTR) తో సినిమాల గురించి అతను కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) …. “ఉదాహరణకి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ 50వ సినిమాని నిర్మించాలని అనుకుంటుంది అనుకోండి.

ఆ సినిమాని పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఒకటితో చేయాల్సి వస్తే.. ఏ హీరోని ఎంపిక చేసుకుంటారు?” అంటూ నాగవంశీని ప్రశ్నించాడు. ఇందుకు అతను సమాధానమిస్తూ.. “ఇక కళ్యాణ్ గారు నెక్స్ట్ రాజకీయాల్లో పెద్ద పెద్ద పొజిషన్ కి వెళ్ళాలి అని కోరుకోవాలి కానీ, మనం ఆయనతో సినిమా చేయాలని కోరుకోకూడదు.

నెక్స్ట్ ఆయన రాష్ట్రానికి ఏం చేస్తారు? దేశానికి ఏం చేస్తారు? అనేది కోరుకోవాలి. ఇప్పుడు ఆయన ఆ రేంజ్లో ఉన్నారు కాబట్టి..! సో 50వ సినిమా అంటూ చేస్తే.. అది తారక్ అన్నతోనే అని నేను కోరుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ. ఇందుకు సంగీత్ శోభన్.. ‘మంచి కవర్ డ్రైవ్ అన్నా’ అంటూ చమత్కరించాడు.
Sithara’s 50th Film – Choose One Hero – #JrNTR or #PawanKalyan?#NagaVamsi answers… pic.twitter.com/Z7SlU109Ol
— Gulte (@GulteOfficial) March 20, 2025

















