దగ్గుబాటి రానా (Rana) .. ‘లీడర్’ (Leader) తో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన తర్వాత.. ఏవేవో సినిమాలు చేసి ప్లాప్..లు మూటగట్టుకున్నాడు. అయితే ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (Krishnam Vande Jagadgurum) అనే సినిమా అతని కెరీర్ ను మార్చేసింది. దాని తర్వాతే ఇతనికి ‘బాహుబలి’ (Baahubali) లో ఛాన్స్ లభించింది. ఆ సినిమాలో రానాని ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అని రాజమౌళి (S. S. Rajamouli) ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘బాహుబలి’ లో రానా చేసింది విలన్ రోల్.
అయినప్పటికీ అతని పాత్రకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇతనికి పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడటానికి ముఖ్య కారణం కూడా అదే. అయితే ‘బాహుబలి’ తర్వాత రానా ఆరోగ్యం దెబ్బ తిన్నట్టు వార్తలు వినిపించాయి. అతనికి కిడ్నీ మార్పిడి కూడా జరిగినట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. సరే వాటిని కూడా పక్కన పెట్టేస్తే హిందీలో కూడా రానా అనేక సినిమాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ రోల్స్ చేసాడతను. ఈ పాత్రల కోసం అతను రూ.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఇప్పుడు కూడా హీరోగా రానా చేస్తున్నది 2 సినిమాలే. కానీ విలన్ గా లేదా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేస్తున్న సినిమాల సంఖ్య 5 కావడం విశేషంగా చెప్పుకోవాలి. సో ఎక్కువగా రానా విలన్ రోల్స్ తోనే కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. రజినీకాంత్ (Rajinikanth) సినిమాలో కూడా రానా విలన్ రోల్ చేస్తుండటం ఇంకో విశేషంగా చెప్పుకోవాలి.