టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విరించి వర్మ (Virinchi Varma) 2013లో ‘ఉయ్యాల జంపాల’ (Uyyala Jampala) సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న విరించి వర్మ చాలామంది హీరోల దృష్టిలో పడ్డాడు. ‘ఉయ్యాల జంపాల’ మూవీలో హీరో హీరోయిన్లుగా నటించిన రాజ్ తరుణ్ (Raj Tarun), అవికా గోర్ (Avika Gor) కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీని తీసింది ఓ కొత్త దర్శకుడు అని తెలుసుకొని చాలామంది ఆశ్చర్యపోయారు.
Rajamouli
ఎందుకంటే ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా సాగుతుంది. ఈ సినిమాకి ముందు వరకు షార్ట్ ఫిల్మ్‌లకే పరిమితమైన రాజ్ తరుణ్ దీని తర్వాత సినిమా హీరోగా మారిపోయాడు.అన్నపూర్ణ స్టూడియోస్ దీన్ని నిర్మించింది. జాతి రత్నాలు (Jathi Ratnalu) ఫేమ్ అనుదీప్ (Anudeep Kv) ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ మూవీలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా ద్వారా విరించి వర్మ పనితనం ఏంటో తెలుసుకున్న నాని (Nani) అతనితో ఒక సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు.
ఈ దర్శకుడి వద్ద ఒక మంచి కథ ఉండటంతో నానికి వినిపించాడు. అది నచ్చడంతో ఈ నేచురల్ స్టార్ ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అది మరేదో కాదు 2016 లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ మజ్ను (Majnu) . ఈ మూవీ కూడా బాగానే ఆడింది. పెట్టిన బడ్జెట్‌కు దాదాపు రెట్టింపు డబ్బులు వసూలు చేసింది. ఇందులో నాని, అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) , రియా సుమన్ (Riya Suman) హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో నానిని ఒక రచయితగా చూపించాలని డైరెక్టర్ విరించి అనుకున్నాడు కానీ నాని మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్‌గా చూపిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. దాంతో నాని క్యారెక్టర్‌ని అలాగే డిజైన్ చేసుకున్నాడు. కానీ ఎవరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు చూపించాలో అర్థం కాలేదు. అప్పుడు నాని రాజమౌళి (S. S. Rajamouli) దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్ గా పని చేసినట్లు చూపిస్తే బాగుంటుందని విరించికి చెప్పాడట. అందుకు ఆ దర్శకుడు కూడా ఒప్పుకున్నాడు.
తర్వాత నాని రాజమౌళిని (Rajamouli) రిక్వెస్ట్ చేస్తే ఈ సినిమాలో కనిపించడానికి ఆయన వెంటనే ఓకే చెప్పేసారు. అలా జక్కన్న.. నాని కోరడం వల్లే ‘మజ్ను’ సినిమాలో కనిపించాడు. ఆయన సన్నివేశాలు ఇందులో చాలానే ఉంటాయి. ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోనే తీశారు. బాహుబలి (Baahubali) సెట్ లోనే దీని పూర్తి చేసినట్లు సమాచారం. ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) బాగా హెల్ప్ చేశాడు. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జితేందర్ రెడ్డి’ (Jitender Reddy) రిలీజ్ కి రెడీగా ఉంది.