Tamannaah, Rajinikanth : సూపర్ స్టార్ కి జోడిగా మిల్కీబ్యూటీ!

సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమవుతుంది. కాజల్, నయనతార, త్రిష లాంటి వాళ్లను రిపీట్ చేస్తున్నారు మన హీరోలు. పోనీ యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేద్దామంటే.. ఆడియన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. అందుకే వయసులో చిన్న హీరోయిన్లతో కలిసి నటించే సాహసం చేయడం లేదు మన హీరోలు. దీంతో వారికి ఆప్షన్స్ లేకుండా పోతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్ లో నయన్, త్రిష, అనుష్క, రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లతో కలిసి నటిస్తూ వచ్చారు.

కానీ మళ్లీ మళ్లీ వాళ్లను రిపీట్ చేయడం ఇబ్బందిగా మారుతోంది. అందుకే కొత్త ఆప్షన్స్ ను వెతుక్కోక తప్పడం లేదు. ఇప్పుడు రజినీకాంత్ కోసం మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ‘కోలమావు కోకిల’, ‘డాక్టర్’ వంటి సినిమాలతో మెప్పించిన నెల్సన్.. ఇటీవల ‘బీస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

‘బీస్ట్’తో నిరాశ పరిచినప్పటికీ.. రజినీకాంత్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు నెల్సన్. వీరిద్దరి కాంబినేషన్ లో ‘జైలర్’ అనే సినిమా రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. నిజానికి నెల్సన్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అయితే రజినీకాంత్ పక్కన తమన్నా అనేసరికి..

ఆన్ స్క్రీన్ ఈ జంట ఎలా ఉంటుందనే సందేహాలు వినిపిస్తున్నాయి. కథలో ఇమిడిపోయే రోల్ అయితే వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు అనౌన్స్మెంట్ రానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుద్ సంగీత దర్శకుడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus