థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో టీజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేటి యువత టీజర్లను చూసి మూవీపై ఒక అంచనాకు వస్తున్నారు. అందుకే ఫిల్మ్ మేకర్లు సినిమా ఎడిటింగ్ లోనే కాదు టీజర్ కట్ పైన శ్రద్ధ పెడుతున్నారు. దానికి యూట్యూబ్ లో వచ్చే రెస్పాన్స్ కూడా ఒక రికార్డుగా నమోదవుతోంది. అలా 2016 లో ఎక్కువమంది చూసిన టీజర్లపై ఫోకస్ …
కబాలిసౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ మాత్రమే కాదు.. టీజర్ కూడా రికార్డ్ సృష్టిస్తుందని కబాలి నిరూపించింది. పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్ లో అప్లోడ్ అయిన రెండురోజుల్లోనే 20 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇందుకు వచ్చిన రెస్పాన్స్ చూసి డైరక్టర్ ట్రైలర్ విడుదల చేయకుండానే చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు కబాలి టీజర్ ని 6,474,871 సార్లు చూసారు. టాలీవుడ్ లో ఇదే హైయెస్ట్.
జనతా గ్యారేజ్కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్. ఈ చిత్రం రిలీజ్ కి ముందే హిట్ టాక్ సొంతం చేసుకోవడానికి కారణం టీజర్. జనతా గ్యారేజ్ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ వీడియోని ఇప్పటివరకు యాభై లక్షల మంది చూసారు.
నాన్నకు ప్రేమతో ..సూపర్ క్లాస్ లుక్ తో ఎన్టీఆర్ కనిపించిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ చిత్రం టీజర్ లో తారక్ లుక్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. అతన్ని చూసేందుకు ఈ టీజర్ ని ఎక్కువమంది క్లిక్ చేశారు. నాన్నకు ప్రేమతో టీజర్ 48 లక్షల వ్యూస్ ని కలిగి మూడవ స్థానంలో నిలిచింది.
ధృవమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ధృవ దూసుకుపోతోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్ అత్యంత వేగంగా 40 లక్షల మార్క్ ని దాటేసింది. డిసెంబర్ 9 న రిలీజ్ కానున్న ఈ మూవీ, ఆ సమయానికి యూట్యూబ్ లో టీజర్ మొదటి స్థానానికి వెళ్లే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సరైనోడుస్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇమేజ్ ని మరో మెట్టు ఎక్కించిన సినిమా సరైనోడు. ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. మాస్.. ఊర మాస్ అనే ఒకే డైలాగ్ తో ఉన్న ఈ వీడియోని 26 లక్షలమందికి పైగా చూసారు.
సర్దార్ గబ్బర్ సింగ్గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా టీజర్ విడుదలైన ఒక వారంలోనే 20 లక్షల మార్క్ ని దాటేసింది. ఈ సినిమా ఆశించినంతగా విజయం సాధించక పోయినా టీజర్ మాత్రం ఎక్కువమందిని ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈ వీడియోని చూసిన వారి సంఖ్య 25, 97, 913.
బ్రహ్మోత్సవంశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రిన్స్ చాలా గ్లామరస్ గా కనిపించి మళ్లీ మళ్లీ చూసేలా చేశారు. ఇప్పటివరకు ఈ టీజర్ కి16 లక్షలకు పైనే వ్యూస్ వచ్చాయి.
ఇజంనందమూరి హీరో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ తో అదరగొట్టిన మూవీ ఇజం. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ కళ్యాణ్ రామ్ కి సరికొత్త అభిమానులను తీసుకొచ్చింది. ఈ వీడియోని క్లిక్ చేసిన వారి సంఖ్య 1,650350 .
అ.. ఆఈ ఏడాది విజయం సాధించిన చిత్రాల్లో అ.. ఆ ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నితిన్ కి మంచి పేరును తీసుకొచ్చింది. ఈ చిత్ర టీజర్ ని నెటిజనులు 1,275,100 సార్లు చూసారు.
ఊపిరికింగ్ నాగార్జున వీల్ కుర్చీల్లోంచి చేసిన మ్యాజిక్ ఊపిరి. తమిళ నటుడు కార్తీ, నాగ్ కలిసినటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చిన వెంటనే చూసేందుకు నాగ్ అభిమానులు ఉత్సాహం చూపించారు. అందుకే 1,199,346 వ్యూస్ తో ఈ టీజర్ అత్యధికంగా చూసిన జాబితాలో చేరింది.
గౌతమి పుత్ర శాతకర్ణినందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం “గౌతమి పుత్ర శాతకర్ణి” టీజర్ అక్టోబర్ 10 న విడుదలైన సంచలనానికి నాంది పలికింది. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బాలయ్య చెప్పిన “విశ్రాంతి లేదు.. విరామం లేదు .. నా కత్తికి అంటిన నెత్తుటి చార, ఇంకా పచ్చిగానే ఉంది.. సమయం లేదు మిత్రమా, శరణమా.. రణమా!” .. అనే ఒకే ఒక డైలాగ్ చిత్రం పై హైప్ ని రెట్టింపు చేసింది. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ తెరకెక్కించిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఈ టీజర్ రెండు నెలల్లో మూడు మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ని రాబట్టింది. ఈ కౌంటింగ్ వేగంగా పెరుగుతూనే ఉంది.