విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తన కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నాడు. రాహుల్ సంకృత్యన్ ( Rahul Sankrityan) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ‘కింగ్‌డమ్’ (Kingdom). విడుదల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. 1854-1878 మధ్య కాలంలో రాయలసీమ నేపథ్యంలో జరిగే ఈ కథ, బ్రిటిష్ యుగంలోని చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. పాన్-ఇండియా స్థాయిలో రూపొందే ఈ పీరియడ్ డ్రామా, ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో చూడని స్కేల్‌లో రానుందని అంటున్నారు.
ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, రాహుల్ ఈ కథపై రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ Vijay Deverakonda డబుల్ రోల్‌లో నటిస్తున్నాడని, తండ్రి-కొడుకు పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. రాయలసీమ యాసలో డైలాగ్స్‌తో ఈ పాత్రలు ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. రష్మికా మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, హాలీవుడ్ స్థాయి సాంకేతికతతో రూపొందనుంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్, ‘ది లెజెండ్ ఆఫ్ కర్స్‌డ్ ల్యాండ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ సినిమా 2026లో విడుదల కానుందని, షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. సినిమా బడ్జెట్ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రం కోసం ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. బ్రిటిష్ కాలంలోని రాయలసీమ నేపథ్యాన్ని అత్యంత వాస్తవికంగా చూపించేందుకు సెట్స్ నిర్మాణంలోనే రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని సమాచారం.
1800ల నాటి వాతావరణాన్ని సెట్స్ ద్వారా సజీవంగా తీసుకురావడం అంత సులభం కాదు, అందుకే ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించినట్లు అంటున్నారు. ప్రస్తుతం తొలి దశ షూటింగ్ కోసం కొన్ని సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి సాంకేతిక నిపుణులను కూడా తీసుకొచ్చారని, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్‌లో అత్యున్నత స్థాయి నాణ్యతను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.