Bunny Vas: బన్నీ వాస్‌ ట్వీట్‌ ఎవరి గురించి? ఏం జరిగింది? ఇదేమన్నా ప్రమోషన్‌ స్టంటా?

టైటిల్‌ చూడగానే గీతా ఆర్ట్స్‌ వాళ్ల ట్విటర్‌ ఖాతాల్లోకి వెళ్లి చూసి వచ్చేశారా? కచ్చితంగా అక్కడ మీకేం కనిపించదు. ఎందుకంటే ఇక్కడ గీతా ఆర్ట్స్‌ అంటే వాళ్ల అకౌంట్‌ అని కాదు. వాళ్ల దగ్గర వ్యక్తుల ఎక్స్‌ అకౌంట్‌లో అని అర్థం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి (Allu Aravind) చెంది గీతా ఆర్ట్స్‌కు సన్నిహితులు చాలా మంది ఉంటారు. అందులో అల్లు అర్జున్‌ (Allu Arjun) స్నేహితుడు, నిర్మాత అయిన బన్ని వాస్‌ (Bunny Vasu) ఒకరు. అలాగే మరో నిర్మాత ఎస్‌కేఎన్‌ (SKN) కూడా. ఈ ఇద్దరూ నిన్న రాత్రి ఎక్స్‌లో కాసేపు ఆడుకున్నారు.

Bunny Vas

బన్ని వాస్‌ స్టార్ట్‌ చేస్తే.. దానికి ఎస్‌కేఎన్‌ రిప్లై ఇచ్చారు. దీంతో ఏమైందా అనే చర్చ మొదలైంది. బుధవారం రాత్రి 10.45 సమయంలో బన్ని వాస్‌ ఎక్స్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ పడింది. ‘‘ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది.. శాంతి.. శాంతి.. శాంతి..!’’ ఇదీ ఆ పోస్టు. దీని ప్రకారం ఆయన ఓ విషయం గురించి రియాక్ట్‌ అవ్వాలని ఉందని, కానీ ఆయన అవ్వడం లేదని, గొడవలు వద్దు అనుకునే ఆగిపోయారు అని అర్థమవుతోంది.

అయితే ఆ పోస్టుకి ‘‘అవ్వాలి అనిపిస్తే అయిపోవడమే తరువాత సంగతి తరువాత ’’ అని ఎస్‌కేఎన్‌ కామెంట్‌ చేశారు. దీంతో ఏదో విషయంలో గీతా ఆర్ట్స్‌ టీమ్‌ గట్టిగా హర్ట్‌ అయింది అని తెలుస్తోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆ టీమ్‌ నుండి త్వరలో రాబోతున్న సినిమా, లేదా ఏదైనా సినిమాకు సంబంధించిన వైవిధ్యమైన అనౌన్స్‌మెంట్‌. రాబోతున్న సినిమా అంటే శ్రీవిష్ణు (Sree Vishnu)  హీరోగా తెరకెక్కిన ‘#సింగిల్’(#Single) . మే 9న రానున్న ఈ సినిమా గురించి ఈ మధ్య ఓ పంచాయితీ నడుస్తోంది.

అందులో సెటైరికల్‌ డైలాగ్‌ మీద ఓ హీరో హర్ట్‌ అయ్యారని, అందుకే సారీ చెప్పారు. అలా సారీ చెప్పడం నచ్చకే బన్నీ వాస్‌ ఇలా పోస్ట్‌ చేశారు అని అంటున్నారు. అయితే సారీ చెప్పిన తర్వాత మళ్లీ ఇలా పోస్టులు చేయరు కాబట్టి.. ఇంకేదో విషయాన్ని ఇలా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమోషనల్‌ స్టంట్‌ కూడా కావొచ్చు అనేది మరికొందరి మాట. చూద్దాం ఈ రోజు ఏమన్నా ఈ ట్వీట్ల యుద్ధానికి (ఆటకు) ఫుల్‌స్టాప్‌ పెడతారేమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus