బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణబీర్ ఆలియా భట్ దంపతుల గురించి మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నటువంటి ఈ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైనటువంటి రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అలియా భట్ తెలియజేశారు.
ఇలా ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటికీ తను కమిట్ అయిన సినిమా షూటింగ్లలో పాల్గొనడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇకపోతే ఈమె ప్రెగ్నెంట్ కావడంతో పెద్ద ఎత్తున తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసేవారు.
ఇకపోతే ప్రస్తుతం ఈమె డెలివరీ డేట్ దగ్గర పడటంతో ఇప్పటికే ఆలియా భట్ తన డెలివరీ కోసం ముంబైలోని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రిలయన్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. నేడు ఉదయం ఈమె హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టువెల్లడించారు అయితే ప్రస్తుతం ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది.
ఈ విధంగా అలియా భట్ రణబీర్ దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ క్రమంలోనే అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రణబీర్ కుటుంబ సభ్యులు సైతం తమ చిన్నారికి ఘన స్వాగతం పలకడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.