స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ విడుదలై సక్సెస్ సాధించగా వచ్చే ఏడాది పవన్ నటించిన భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కానున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతున్నప్పటికీ పవన్ మాత్రం భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కు తగ్గకూడదని భావిస్తున్నారు.
మరోవైపు రాజకీయాల్లో కూడా పవన్ బిజీగా ఉంటూ వేర్వేరు సమస్యల గురించి స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో రష్యాకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో పవన్ రష్యాకు పయనమైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత రష్యాకు వెళ్లి జనవరి ఫస్ట్ వీక్ లో పవన్ భారత్ కు తిరిగి రానున్నారని బోగట్టా.
రష్యా నుంచి వచ్చిన వెంటనే భీమ్లా నాయక్ ప్రమోషన్స్ తో పవన్ బిజీ కానున్నారని తెలుస్తోంది. పవన్ భార్య అన్నా లెజ్‌నేవా రష్యా ప్రాంతానికి చెందిన వారు కాగా ఆమె పిల్లలతో కొంతకాలం నుంచి అక్కడే ఉంటున్నారు. భార్య, పిల్లలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని భావించి పవన్ రష్యాకు పయనమవుతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా రెండు వారాల పాటు పవన్ సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు.
వచ్చే ఏడాది వరకు పవన్ పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. 2023 నుంచి పవన్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కానున్నారు. పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి ఎంతో శ్రమిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు రాగా 2024 ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని పవన్ అనుకుంటున్నారు. టీడీపీ, జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.