గత కొన్ని నెలలుగా సౌత్ సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు నామమాత్రపు కలెక్షన్లను సాధించడంలో ఫెయిల్ అవుతుంటే సౌత్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. నాలుగు నెలల్లో సౌత్ సినిమాలలో మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలు సౌత్ లోని వేర్వేరు భాషల సినిమాలు కావడం గమనార్హం. మార్చి నెలలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కి భారీ అంచనాలతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపుగా 1150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయినా ఈ సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఏప్రిల్ నెలలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా విడుదలైంది. కన్నడ భాషలో గతంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించడం గమనార్హం.
ఈ సినిమా ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. కన్నడలో కేజీఎఫ్2 ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించింది. కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లో విక్రమ్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా తమిళంలో బాహుబలి2 క్రియేట్ చేసిన సంచలన రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
తక్కువ గ్యాప్ లో వేర్వేరు సౌత్ భాషలలో ఇండస్ట్రీ హిట్లు క్రియేట్ కావడం ఫ్యాన్స్ కు సైతం ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. విక్రమ్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.