Bigg Boss Telugu 6: సిసింద్రీ టాస్క్ లో గెలిచింది .. నిలిచింది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో సిసింద్రీ టాస్క్ ప్రస్తుతం నడుస్తూనే ఉంది. అర్ధరాత్రి హై డ్రామా చేసిన గీతు అందరి బొమ్మలు కొట్టేసేందుకు ప్రయత్నించింది. అంతేకాదు, రాజ్ ఇంకా శ్రీహాన్ ఇద్దరూ కూడా వేరేవాళ్లు పడుకున్నప్పుడు వెళ్లి వాళ్ల బేబీలని దొంగతనం చేసి లాస్ట్ అండ్ ఫౌండ్ లో వేసేశారు. దీంతో ఆటలోనుంచీ కొంతమంది తప్పుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన వాళ్లకే ఛాలెంజస్ అనేవి పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ ఛాలెంజ్ లో చంటి విన్ అయ్యాడు. అలాగే, సెకండ్ ఛాలెంజ్ లో ఇనయ సుల్తానా అలాగే నెక్ట్స్ ఆర్జే సూర్య, ఇంకా రాజశేఖర్ గెలిచినట్లుగా సమాచారం.

సో, నలుగురు ప్రస్తుతానికి కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. మరి వీళ్లలో ఇంటి కెప్టెన్ ఎవరు అయ్యారు అనేది కెప్టెన్సీ టాస్క్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. రెండో టాస్క్ లో రింగ్ లో ఉన్న ఇనయా సుల్తానా షీల్డ్ తో గట్టిగానే ఫైట్ చేసింది. అయితే, ఇక్కడే అపోజిట్ గా వచ్చిన కీర్తి చాలాసేపు ప్రతిఘటించినా కూడా రింగ్ లో నిలవలేకపోయింది. అంతేకాదు, షీల్డ్ తో బలంగా నెట్టడం వల్ల స్టమక్ దగ్గర కండ పట్టేసి చాలాతసేపు బాధపడింది కీర్తి.

మెడికల్ ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లి కాసేపు తేరుకుని వచ్చింది. ఈ టాస్క్ లో ఇనయ సుల్తానా గెలిచింది. నిజానికి బేబీ టాస్క్ లో చూసినట్లయితే, చాలామంది పార్టిసిపెంట్స్ అర్ధరాత్రి నిద్రకూడా పోకుండా గేమ్ ఆడారు. గీతు అయితే చాలా తెలివిగా తన బేబీని స్టోర్ రూమ్ లో పెట్టింది. ఒంటరిగా లోన్లీ ప్లేస్ లో పెట్టింది. అంతేకాదు, స్టోర్ రూమ్ లో పెట్టానని బిగ్ బాస్ కి చెప్పింది. అంతేకాదు వేరేవాళ్ల బేబీ ఒంటరిగా దొరికితే తీసుకుని వెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్స్ లో పారేసింది.

దీంతో హౌస్ మేట్స్ అందరూ గీతు బేబీ ఎప్పుడు దొరుకుతుందా అని చాలా ఆత్రంగా ఎదురు చూశారు. కానీ, ఎంత వెతికినా కూడా గీతు బేబీడాల్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు.మొత్తానికి ఈ టాస్క్ ని గలాటే గీతు ఎంటర్ టైన్మెంట్ గా ఆడుతూ హౌస్ మేట్స్ కి , ఆడియన్స్ కి కిక్ ఇచ్చింది. తనదైన స్టైల్లో యాస మాట్లాడుతూ బేబీని ఎత్తుకుంటూ ఇల్లంతా సందడి చేసింది. మరి బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో దాచిన బేబికి గీతుకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus