ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాల చోటు చేసుకుంటున్నాయి.ఒకరి మరణ వార్త మర్చిపోకముందే ఇండస్ట్రీకి చెందినటువంటి మరొకరు మరణించడంతో ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొన్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ మాజీ మాజీ అధ్యక్షులు కొమరం వెంకటేష్ మరణ వార్త ఇండస్ట్రీని ఒక్కసారిగా కలచివేసింది.
ప్రకాశం జిల్లా మాచర్లకు చెందిన వెంకటేష్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ గా ఇండస్ట్రీలో తన కెరియర్ ప్రారంభించారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన ఈయన చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన షేర్ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొమరం వెంకటేష్ తాజాగా బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించినట్లు తెలుస్తోంది.
కొమరం వెంకటేష్ కుబ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స జరుగుతూ ఉండగానే శుక్రవారం రాత్రి ఈయన చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఈయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఈయన మరణ వార్త తెలిసినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈయనకు నివాళులు అర్పించారు.