సినిమా రీమేక్ చేసేటప్పుడు… యాజ్ ఇట్ ఈజ్‌గా తీసేస్తే నెటిజన్లు ఆడేసుకుంటారు. అలా అని సినిమాలో మార్పులు చేస్తే ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అయ్యింది అంటారు. అందుకే రీమేక్ డైరెక్షన్ కత్తి మీద సాము అనే అంటారు. అయితే ఈ క్రమంలో ఏవైనా మంచి సీన్స్ వదిలేస్తే ఫ్యాన్స్‌కి చాలా బాధ అనిపిస్తుంది. అలా ‘భీమ్లా నాయక్’లో కొన్ని సీన్స్ మిస్ అయ్యాయి. అయితే వాటిని ఎందుకు తీసేశారు అనే విషయంలో వారికి క్లారిటీ ఉంటుందనుకోండి.
అయినా మాతృకలోని ఒకటి రెండు సీన్స్ మాత్రం ‘భీమ్లా నాయక్’లో ఉండుంటే బాగుండు అని మాత్రం అనుకుంటున్నారు. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు అంటే… ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో తెగ చూసేశారు. ఈ సీన్‌లో పవన్ కల్యాణ్ ఎలా చేస్తాడు, ఆ సీన్‌లో పవన్ ఎలా కనిపిస్తాడు అంటూ లెక్కలేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రలో రానా కనిపిస్తాడు, ఇద్దరి మధ్య పోరాటం ఏ స్థాయిలో ఉంటుంది అనేది లెక్కలేసుకున్నారు.
ఈ క్రమంలో మాతృకలో కొన్ని సీన్స్ ‘భీమ్లా నాయక్’లో మిస్ అయ్యాయి. వాటిలో ఓ రెండు, మూడు చూసుకుందామా. ‘అయ్యప్పనుమ్ కొషియమ్’లో కూట్టమణి పాత్ర ఇంటిని అయ్యప్పన్ బుల్డోజర్‌తో కూల్చేస్తాడు. సినిమాను ఆ సీన్ మంచి హైకి తీసుకెళ్తుంది. పక్కనే కోషి ఉండటంతో సీన్ ఓ రేంజి హై వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఆ సీన్‌ను బాంబుతో రీప్లేస్ చేశారు. ఈ క్రమంలో అక్కడ కామెడీ వర్కువుట్ అయ్యింది కానీ. మాస్ సీన్ మిస్ అయ్యింది.
మరోసారి కోషి రోడ్డు మీద నడుచుకొని వస్తుంటే అయ్యప్పన్ లిఫ్ట్ ఇస్తాడు. ఈ సీన్‌ను పూర్తిగా ‘బీమ్లా నాయక్’లో ఎత్తేశారు. అయ్యప్పన్ మెడ మీద కత్తి పెట్టిన సీన్ హైలైట్. ఇది ఇక్కడ మిస్. ఇవి ఒకటి రెండు సీన్లు మాత్రమే. సినిమాలను ఇంకా తరచి తరచి చూస్తే చాలా మిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ మరోసారి, మరో వార్తలో చూద్దాం.