పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు దేవుడు. అందుకే ఆయన అభిమానులు “పవనిజమ్”ని తమ మతంగా భావిస్తారు. పవన్ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి తారతమ్యాలు ఉన్నా…తాను మనసున్న మనిషిగా ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు….అయితే అదే క్రమంలో ఆయన రాజకీయాల్లోకి సైతం “జనసేన” పేరుతో దూకుతున్నారు…ఇదిలా ఉంటే తాజాగా ఆయాన ఒక మంచి పనికి అండగా నిలబడ్డారు..అదేమిటంటే…. తెలుగు నవలా సాహిత్యంలో మేరు పర్వతంలా కనిపించే గుంటూరు శేషేంద్ర శర్మ ఎన్నో రచనాలు రాశారు. ఆ రచనల్లో ‘ఆధునిక మహాభారతం’ సాహిత్యంలో ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. అలాంటి గొప్ప పుస్తకం ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఒక బుక్ స్టాల్‌లో కనిపించింది. అసలే మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన ఈయనకు.. సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని గడించిన ఆ పుస్తకం కనిపించిన వెంటనే కొనుగోలు చేసి.. దాన్ని చదివాడట.
ఆ పుస్తకంతో ఎంతో స్ఫూర్తిని పొందిన ఆయన .. దాని ప్రత్యేకత గురించి ఓరోజు పవన్‌కి చెప్పి.. అది ఆయనకి ఇచ్చాడట. అలా త్రివిక్రమ్ ఇచ్చిన పుస్తకాన్ని చదివిన పవన్‌కు.. అందులోని కథా వస్తువు ఆలోచింపజేసేదిగా వుండటంతో, మార్కెట్లో దాని గురించి వాకబు చేశాడట. అయితే.. ఆ పుస్తకం అందుబాటులో లేదని పవన్‌కి తెలిసింది. అంతటి గొప్ప పుస్తకం మార్కెట్‌లో లేకపోవడంతో కాస్త నిరాశకు గురైన పవన్.. అది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వెంటనే శేషేంద్రశర్మ కుమారుడితో మాట్లాడారు. ‘ఆధునిక మహాభారతం’ మలి ముద్రణకి (రెండోసారి ప్రింటింగ్‌కి) ఏర్పాట్లు చేయమనీ.. 25000 పుస్తకాలకి అవసరమయ్యే ఖర్చు తానే భరిస్తానని మాట ఇచ్చారట. ఎంతమంది హీరోలకు ఉంటుంది ఇలాంటి మంచి మనసు అందుకే పవన్ ని అందరూ….తమవాడిగా భావిస్తారు…పవర్ స్టార్ నీకు హాట్స్ ఆఫ్!!!