వరుస మరణాలు, ప్రమాదాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్, గాయని వాణీ జయరాం మరణ వార్త ఇంకా మర్చిపోకముందే.. 23 రోజులుగా ఆసుపత్రిలో పోరాడుతున్న నటుడు నందమూరి తారక రత్న కన్నుమూశారు.. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మైల్ స్వామి కూడా తుదిశ్వాస విడిచారు..
తాజాగా ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్.కె. భగవాన్ ఇక లేరు అనే వార్తతో శాండల్ వుడ్ ఇండస్ట్రీ షాక్‌కి గురైంది.. ఆయన వయసు 89 సంవత్సరాలు.. 1933 జూలై 5న జన్మించిన భగవాన్.. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేసి.. 1956లో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటరయ్యారు.. దొరై రాజ్‌తో కలిసి ఆయన దర్శకుడిగా మారారు..
దొరై – భగవాన్ ద్వయం 1968లో ‘జెడర బాలె’ తో ప్రస్థానం ప్రారంభించారు. కన్నడ పరిశ్రమకి తొలి జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను పరిచయం చేసింది వీరే.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్‌తో పలు విజయవంతమైన సినిమాలు తీశారు.. అనంత్ నాగ్, లక్ష్మీలతోనూ చిత్రాలు నిర్మించారు. వీరు 24కి పైగా నవలా ఆధారిత చిత్రాలను తెరకెక్కించారు.. ‘కస్తూరి నివాస’, ‘ఎరడు కనసు’, ‘బయలుదారి’, ‘గాలిమాటు’, ‘చందనాడ గొంబే’, ‘హోసాబెలకు’, ‘జీవన చైత్ర’, ‘గోవా డల్లి సి.ఐ.డి 999’, ‘ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి సి.ఐ.డి 999’ వంటి పలు చిత్రాలు చేశారు.
మిత్రుడు దొరై రాజ్ మరణం తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు భగవాన్.. వీరి కలయికలో వచ్చిన చివరి చిత్రం.. ‘బాలోండు చదురంగ’ (1996).. ‘అదువ గొంబే’ తో 2019లో కమ్ బ్యాక్ ఇచ్చారు.. తన 85వ ఏట ఆయన తీసిన 50వ మూవీ ఇది.. భగవాన్, దొరై ఇద్దరూ కన్నడ సినిమాకి రెండు కళ్లు అని సీనియర్ నటి సుమలత ట్వీట్ చేశారు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.. కన్నడ చిత్ర రంగానికి చెందిన వారంతా భగవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నారు..
ಕನ್ನಡ ಸಿನಿಮಾ ರಂಗದ ಹೆಸರಾಂತ ನಿರ್ದೇಶಕ ಎಸ್.ಕೆ.ಭಗವಾನ್ ಅಗಲಿಕೆಯ ಸುದ್ದಿ ಅಪಾರ ನೋವನ್ನುಂಟು ಮಾಡಿದೆ. ಕನ್ನಡ ಸಿನಿಮಾ ರಂಗಕ್ಕೆ 24ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾದಂಬರಿ ಆಧಾರಿತ ಸಿನಿಮಾಗಳನ್ನು ಕೊಟ್ಟು ಸಾಹಿತ್ಯ ಮತ್ತು ಸಿನಿಮಾ ರಂಗವನ್ನು ಬೆಸೆದ ಅಪರೂಪದ ನಿರ್ದೇಶಕ ಅವರು. ದೊರೈ ಮತ್ತು ಭಗವಾನ್ ಸಿನಿಮಾ ರಂಗದ ಎರಡು ಕಣ್ಣುಗಳು.
1/2 pic.twitter.com/AO9BFgLb4G
— Sumalatha Ambareesh ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) February 20, 2023
ಕನ್ನಡ ಚಲನಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಿರ್ದೇಶಕ ಶ್ರೀ ಎಸ್. ಕೆ. ಭಗವಾನ್ ರವರ ನಿಧನದ ಸುದ್ದಿ ತಿಳಿದು ಮನಸ್ಸಿಗೆ ಅತ್ಯಂತ ಬೇಸರವಾಯಿತು. ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಸದ್ಗತಿ ಕೋರುತ್ತೇನೆ. ಅವರ ಕುಟುಂಬವರ್ಗದವರಿಗೆ ಈ ನೋವನ್ನು ಸಹಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಭಗವಂತ ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ.
1/2 pic.twitter.com/KNUL0Gh1wt