సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. నటీనటులు, దర్శక నిర్మాతలు, లేదంటే టెక్నికల్ టీం సభ్యులు…. లేదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు.. ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. గద్దర్ నుండి దిల్ రాజు తండ్రి వరకు ఎంతో మంది ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. కొందరు వయసు సంబంధిత సమస్యలతో, మరికొందరు అనారోగ్య సమస్యలతో, కొంతమంది గుండెపోటుతో, మరికొంత మంది రోడ్డు ప్రమాదాల్లో.. అవీ కాదు అంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోవడం వంటి వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం.
ఈ మధ్యనే నాజర్ తండ్రి కూడా కన్నుమూశారు. తాజాగా బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ ప్రముఖ నటి భైరవి వైద్య కన్నుమూశారు. అయితే ఆమె ఈ నెల 8నే మరణించగా..ఆ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భైరవి వైద్య మరణించిన విషయాన్ని ఆమె కూతురు జాంకీ వైద్య, సన్నిహితులు తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె అక్టోబర్ 8న తుదిశ్వాస విడిచారు.
ఆమె (Bhairavi Vaidya) సినీ పరిశ్రమలో దాదాపు 45 ఏళ్లుగా ఉంటూ వచ్చారు. గుజరాతీ, హిందీ చిత్రాల్లో నటించారు భైరవి వైద్య. బుల్లితెరపై కూడా కూడా పలు టీవీ షోలలో, సీరియల్స్ లో ఆమె నటించడం జరిగింది. బాలీవుడ్‌లో అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ ల ‘తాల్’, సల్మాన్ ఖాన్ ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ వంటి బడా చిత్రాల్లో ఆమె నటించడం జరిగింది.