బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 6 ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. ఐదోవారం ముగిసినా కూడా షోకి రేటింగ్ మాత్రం రావడం లేదు. దీంతో బిగ్ బాస్ టీమ్ ఆలోచనలో పడింది. గత సీజన్ లో ఐదోవారం నుంచీ విజె సన్నీ, సిరి, షణ్ముక్ గొడవ వల్ల షో రసవత్తరంగా మారింది. ఆ తర్వాత వీకండ్ గిల్టీ బోర్డ్ సన్నీకి వేసేసరికి ఆడియన్స్ లో సింపతీ పెరిగింది. సన్నీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రతి చిన్న వీడియో క్లిప్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ హల్ చల్ చేశారు. కానీ, ఇప్పుడు ఈసారి సీజన్ లో ఆ ఛాన్స్ లేకుండా పోతోంది. వారం వారం రేటింగ్ తగ్గుతూ వస్తోంది. నిజానికి సోమవారం నుంచీ శుక్రవారం వరకూ రేటింగ్ తక్కువగా ఉన్నా కూడా వీకెండ్స్ మాత్రం బిగ్ బాస్ షో దుమ్మురేపేది. హోస్ట్ వచ్చి హౌస్ మేట్స్ ని రోస్ట్ చేస్తుంటే ఆడియన్స్ కి మంచి కిక్ ఉండేది.
అందుకే, వీకెండ్స్ షోకి బాగా రేటింగ్ వచ్చేది. కానీ, ఈసీజన్ లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనికి చాలా కారాణాలున్నాయి. అందులో కొన్ని మనం చూసినట్లయితే., గత సీజన్స్ లో బిగ్ బాస్ షో కేవలం గంటన్నరపాటు టెలివిజన్ లో మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. దీనిపై ఆడియన్స్ కి క్లారిటీ ఉండేది. హౌస్ లో 24 గంటలు ఏంజరిగిందో ఆడియన్స్ కి తెలిసేది కాదు. కేవలం ఈ గంట షో మాత్రమే చూసి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని డిసైడ్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు 24 గంటలు హాట్ స్టార్ లో లైవ్ పెట్టేసరికి బిగ్ బాస్ చూసే వారి సంఖ్య తగ్గిపోయింది.
ఎందుంకటే, వాళ్లు చూడని క్లిప్స్ కూడా యూట్యూబ్ లో లేదా, వేరే సోషల్ మీడియాలో దర్సనమిస్తుంటే షోపై ఆసక్తి కోల్పోయారు. ఇక ఈసీజన్ లో పార్టిసిపెంట్స్ కూడా చెప్పుకోదగ్గ వాళ్లు ఎవరూ లేరు. వచ్చినవాళ్లు అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ , ఎక్కడా బ్యాడ్ అవ్వకూడదంటూ గేమ్ ఆడుతున్నారు. అంతేకాదు, గీతురాయల్- ఆదిరెడ్డి ఇద్దరూ కూడా గేమ్ ఆడదాం అన్నా, స్ట్రాటజీలు ప్లే చేద్దామన్నా హౌస్ మేట్స్ ఎవరూ వారితో పెట్టుకునేందుకు ఆసక్తిని చూపించడం లేదు. నాగార్జున వీకండ్ మెచ్చుకుంటే చాల్లే అన్నట్లుగానే గేమ్ ఆడుతున్నారు.
హౌస్ మేట్స్ టాస్క్ లలో కూడా పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు. ఏదో మొక్కుబడిగా టాస్క్ లని లాగించేస్తున్నారు. అంతేకాదు, పెర్ఫామన్స్ కంటే కూడా డీల్స్ పెట్టుకుని కెప్టెన్ అవ్వడానికో, ఇంకో వారం హౌస్ లో గడపడానికో చూస్తున్నారే తప్ప, ఆడియన్స్ కి ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే దశలో గేమ్ ఆడటం లేదు. హోటల్ టాస్క్ లో ఛాన్స్ వచ్చినా కూడా హౌస్ మేట్స్ చాలా చప్పగా పెర్ఫామ్ చేశారు. దీంతో ఆడియన్స్ కి బిగ్ బాస్ పట్ల ఉన్న ఆసక్తి సన్నగిల్లింది.
హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ లో కూడా ఆసక్తికరమైన అంశాలేమి ఉండటం లేదు. టాస్క్ ల్లో ఫెయిర్ గా ఆడుతున్నామా, లేదా అన్ ఫెయిర్ గా ఆడుతున్నామా అనేది పక్కనబెడితే అస్సలు ఆడుతున్నామా లేదా అనేది హౌస్ మేట్స్ చెక్ చేస్కోవడం లేదు. కొన్ని లవ్ ట్రాక్స్ ఓపెన్ అవుతున్నా, ఈసారి ఆడియన్స్ కి బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్ చూడాలంటేనే విరక్తి కలుగుతోంది. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ షో వీకెండ్స్ కూడా ఫ్లాప్ అవ్వడం అనేది బిగ్ బాస్ నిర్వాహకులని కలవరపరుస్తోందనే చెప్పాలి. అదీ మేటర్.