ఓ సినిమాలో హీరోయిన్ ఎంత బాగా యాప్ట్ అయిందో తెలియాలంటే… అందులో ఆమె పేరు ఒరిజినల్ పేరు అయిపోవాలి. అలా రీసెంట్‌గా సినిమాలో ఓ పాత్ర పేరును తన నటనతో తన పేరుగా మార్చేసుకుంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీతగా ఆమె నటన ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ‘సీత’ చర్చలోకి వస్తోంది. ఎందుకంటే ఆమెను సీతగా మార్చిన ‘సీతారామం’ సినిమా మళ్లీ రాబోతోందని టాక్. అంటే ఆ సినిమాకు సీక్వెల్ రాకకు సర్వం సిద్ధమవుతోంది అంటున్నారు.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటించింది రష్మిక మందన. ఆ సినిమా వెండితెర మీద చేసిన మ్యాజిక్ మరోసారి చూపించాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. నిజానికి ‘సీతారామం’ తర్వాత ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలని హను రాఘవపూడి అనుకున్నారు. ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రభాస్ డేట్స్ కుదరడానికి ఇంకా చాలా టైమ్ ఉందట.
ఈ నేపథ్యంలో హను రాఘవపుడి (Sita Ramam) ‘సీతారామం 2’ పై ఆసక్తిగా ఉన్నట్టు టాక్. అయితే తొలి సినిమాలో సీత, రామ్ పాత్రలకు సంబంధించిన కథ పూర్తయిపోయింది. దీంతో ఆ పాత్రలనే వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి చూపిస్తారు అని అంటున్నారు. అంటే పాత్రలు అవే నేపథ్యం వేరుగా ఉండబోతోంది అని చెప్పొచ్చు. దుల్కర్, మృణాల్ జంటని మరోసారి చూసి మురిసిపోవడానికి ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు.
ఇక దుల్కర్ సల్మాన్ సంగతి చూస్తే… తెలుగులో వరుస సినిమాలు ఉంటాయి అని అంటున్నారు. ‘లక్కీ భాస్కర్’, ‘థగ్ లైఫ్’ సినిమాల్లో నటిస్తుండగా… తెలుగులో బాలకృష్ణ కొత్త సినిమాలో నటిస్తున్నాడు అంటున్నారు. ఇది కాకుండా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. త్వరలో వీటి విషయంలో క్లారిటీ వస్తుంది.